రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అప్పుల భారం మోయలేక రైతులు ఉరికొయ్యలకు వేలాడుతుంటే.. రాష్ట్ర ఎంపీలు మాత్రం పార్లమెంట్ సమావేశాల్లో ఈ సమస్యలపై గళమెత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రైతుల పక్షాన వైఎస్ షర్మిల ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు ఉంచారు. రాష్ట్ర రైతాంగం సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించాలని లేదంటే వాకౌట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు.