ఏపీలోని మత్స్యకారులకు ప్రభుత్వం తీపికబురు వినిపించింది. మత్స్యకారుల సేవలో పథకం కింద అర్హులైన మత్స్యకారులకు రూ.20 వేలు చొప్పున అందించనుంది. నెల్లూరు జిల్లా కావలిలో రేపు జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు మత్స్యకారుల అకౌంట్లలో ఈ డబ్బులు జమ చేయనున్నారు.మొత్తం లక్షా 30 వేల కుటుంబాలకు రూ.262 కోట్లు ఆర్థిక సాయం అందించనున్నారు. మరోవైపు ఈ పథకం ప్రయోజనం అందుకోవాలంటే తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేయాలని అధికారులు సూచించారు.