ఏపీ ప్రభుత్వం నిర్ణయం.. కీలక పదవులు భర్తీ

4 months ago 18
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు కీలక పదవులను భర్తీ చేసింది. ఏపీ సమాచార కమిషన్‌ చీఫ్‌ కమిషనర్‌‌తో పాటుగా నలుగురు కమిషనర్లను నియమించింది. వజ్జా శ్రీనివాసరావును సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్‌గా నియమించిన ఏపీ ప్రభుత్వం.. శరత్ చంద్ర కళ్యాణ చక్రవర్తి, గాజుల ఆదెన్న, రవిబాబు, సింహాచలం నాయుడును కమిషనర్లుగా నియమించింది. అలాగే ఏపీ జెన్‌కో ఎండీగా పొగాకు పుల్లారెడ్డిని ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Read Entire Article