AP Govt On Pending House Regularisation: ఏపీలో సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓకే చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా స్థాయిలో ఎంత వరకు చేయగలరో చేయాలని.. ఒకవేళ జిల్లా స్థాయిలో క్రమబద్దీకరణ కుదరని పక్షంలో కేబినెట్‌కు తీసుకు రావాలని ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ల నుంచి సమాచారాన్ని తీసుకోవాలని సూచించారు చంద్రబాబు. ప్రధానంగా వివాదాలు లేకుండా క్రమబద్ధీకరణ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు