గతవారం ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌లు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారని, ఆ సమయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని అడిగితే, ఆయన కుదరదని చెప్పారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో జనసేన కార్యకర్తలు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసులు పెట్టారు.