తెలుగు ప్రజల ఐక్యతకు బూర్గుల రామకృష్ణారావు చిహ్నమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా.. బూర్గుల రామకృష్ణారావు విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారిపై పెట్టాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. అదే సమయంలో ఏపీ-తెలంగాణ హైవేకు బూర్గుల రామకృష్ణారావు పేరు పెట్టాలని సూచించారు.