ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన ఇద్దరు తెలుగు టెకీలు.. తిరిగి వస్తుండగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదంగా మారింది. అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన ఆ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు.. తిరిగి బేస్ క్యాంప్‌కు చేరుకుంటుండగా.. ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలోనే వారు ప్రాణాలు కోల్పోయారు. గతంలో ఎన్నో సాహసయాత్రలు చేసిన అనుభవం ఉన్న ఆ ఇద్దరు టెకీలు మృతి చెందడం ఇప్పుడు బాధాకరంగా మారింది.