మాజీ సీఎం ఎన్టీఆర్ ఉపయోగించిన యాదగిరి హెలికాప్టర్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఓ నెటిజన్ దీనికి సంబంధించిన ఫోటో షేర్ చేయటంతో.. యాదగిరి హెలికాప్టర్ గురించి చర్చ మొదలైంది. 1979లో అప్పటి ప్రభుత్వం చేతక్ హెలికాప్టర్‌ను 65 లక్షలకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో పాటుగా ఆరుగురు ముఖ్యమంత్రులు దీనిని ఉపయోగించారు. ఇక 2005లో అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి హయాంలో దీనిని 40 లక్షలకు విక్రయించారు. ఈ యాదగిరి హెలికాప్టర్ విశేషాలు ఇప్పుడు చూద్దాం.