ఎన్టీఆర్ విగ్రహం దహనం కేసు.. ఎమ్మెల్సీ అభ్యర్థి పాలకూరి అశోక్‌ గౌడ్‌ అరెస్ట్

1 month ago 6
నల్లగొండ పట్టణంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని దహనం చేసిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ప్రధాన సూత్రధారి, వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికల స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ కుమార్ గౌడ్‌తో పాటు అతని అనుచరుడు ఎలికంటి ప్రణీత్‌ను అరెస్ట్ చేసి వారిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకే వీరు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ఎస్పీ శరత్ చంద్రపవార్ వెల్లడించారు.
Read Entire Article