ఎట్టకేలకు ఆ రహదారి పనులు ప్రారంభం.. హైదరాబాద్‌ వెళ్లే వారికి భారీగా తగ్గనున్న సమయం..

8 months ago 22
తాండూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న గుంతల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. రహదారులు, భవనాల శాఖ అధికారులు ఈ రోడ్డు మరమ్మతులు, పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. మొత్తం 40 కిలోమీటర్ల పొడవునా పనుల కోసం రూ.48.80 కోట్లు కేటాయించారు. పట్టణంలోని రెండు కిలోమీటర్ల మేర వరద నిలిచే ప్రాంతంలో సిమెంటు రోడ్డును (రూ.5 కోట్లు) నిర్మిస్తున్నారు. మిగిలిన మార్గానికి రూ.43.80 కోట్లతో ప్యాచ్ వర్కులు, పూర్తిస్థాయి తారు రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనులన్నీ రెండు నెలల్లో పూర్తి చేస్తామని తాండూరు ఇన్‌ఛార్జి డీఈఈ శ్రవణ్ కుమార్ తెలిపారు.
Read Entire Article