హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం అరుదైన అంతర్జాతీయ గుర్తింపును సొంతం చేసుకుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ద్వారా విద్యా నిర్వహణ, పర్యావరణం, ఇంధనం, ఆహార భద్రత అనే నాలుగు కీలక విభాగాల్లో ఓయూకు ఐఎస్‌ఓ సర్టిఫికేషన్లు లభించాయి. దేశంలోనే ఈ ఘనత సాధించిన మొట్టమొదటి విశ్వవిద్యాలయంగా ఉస్మానియా నిలిచింది. హైదరాబాద్‌లోని వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో బీఐఎస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సందీప్ కుమార్ కనోజియా చేతుల మీదుగా ఓయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య కుమార్ ఈ ప్రతిష్టాత్మక ధ్రువపత్రాలను అందుకున్నారు.