అవనిగడ్డ జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రస్తుత రాజకీయాలపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దఫా ఎమ్మెల్యేగా పోటీ చేయడమే తన జీవితంలో చేసిన పెద్ద తప్పని, ప్రస్తుత రాజకీయాల్లో నాయకుల భాష, కలుషిత వాతావరణం చూసి నిత్యం బాధపడాల్సి వస్తోందని అన్నారు. విజయవాడ భవానీపురంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..విలువలకు కట్టుబడిన రోశయ్య లాంటి మహానుభావుల సరసన తాము రాజకీయం చేశామని, ఇప్పటి తరం రాజకీయాలు చూస్తే బాధేస్తుందని వాపోయారు.