ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. సిక్కిం వరదల్లో చిక్కుకున్న ఏపీ ఎమ్మార్వో కుటుంబం!

1 year ago 16
నైరుతి రుతుపవనాల ప్రభావంతో సిక్కింలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే విజయనగరం ఎమ్మార్వో కుటుంబం వరదల్లో చిక్కుకుంది. సెలవుల కోసం వెళ్లిన తహశీల్దార్ కూర్మనాథ రావు కుటుంబం అక్కడే చిక్కుకుపోయింది. అయితే వీరంతా హోటల్‌లో సురక్షితంగా ఉన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ భవన్ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. సిక్కింలోని పలు ప్రాంతాల్లో దాదాపు 1,500 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మిజోరాం రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Read Entire Article