'ఇది మన హైదరాబాదేనా?'.. సైకిల్ ట్రాక్‌పై యువతికి చేదు అనుభవం.. వీడియో వైరల్

2 months ago 19
దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా పేరొందిన హైదరాబాద్‌ నగరంలో ఓ యువతికి భయంకరమైన అనుభవం ఎదురైంది. ఉదయం పూట రన్నింగ్ చేస్తున్న సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆమె ముందు అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఉదయం పూట, రద్దీగా ఉండే ప్రాంతంలోనే మహిళలకు రక్షణ కరువవ్వటంపై నెటిజన్లు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Entire Article