ఇందిరమ్మ ఇళ్లకు ఎంత మంది ఎంపికయ్యారో తెలుసా.. మరో లిస్ట్ ఎప్పుడంటే..

1 year ago 29
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 2.10 లక్షల మంది లబ్ధిదారులు ఎంపికయ్యారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. వచ్చే నెలాఖరులోపు మిగతా పేర్లు సిద్ధమవుతాయని ఆయన చెప్పారు. లబ్ధిదారుల ఎంపికలో విపక్ష ఎమ్మెల్యేలను 40 శాతం పేర్లను సూచించమని కోరారు. ఐటీడీఏ పరిధిలోని గిరిజనులకు 9,200 ఇళ్లు మంజూరు చేశారు. హైదరాబాద్‌లోని మురికివాడలతో పాటు వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లోనూ బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తామని మంత్రి తెలిపారు.
Read Entire Article