‘ఆస్తుల కోసం విషపు రాతలు.. ప్లాన్ ప్రకారమే ఇలా’: డిప్యూటీ సీఎం భట్టి

6 months ago 20
సింగరేణి టెండర్ల వివాదంపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడారు. విమర్శలకు కారణమైన ‘సైట్ విజిట్’ నిబంధన తమ ప్రభుత్వం తెచ్చింది కాదని, 2018లోనే కోల్ ఇండియా దీనిని ప్రవేశపెట్టిందని ఆధారాలతో సహా బయటపెట్టారు. 2021లో ఈ నిబంధనలు ఖరారైనప్పుడు తాము అధికారంలోనే లేమని, కావాలనే కొందరు రాబందుల్లా సంస్థ ఆస్తుల కోసం తప్పుడు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. ప్రజల్లో అపోహలు ఉండకూడదనే ఉద్దేశంతోనే నైనీ కోల్ బ్లాక్ టెండర్లను రద్దు చేశామని.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారణ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని తెలిపారు. దీనివల్ల అసలు దోషులు ఎవరో తేలుతుందని భట్టి స్పష్టం చేశారు.
Read Entire Article