ఆవులను ఢీకొన్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు.. త్రుటిలో తప్పిన ప్రమాదం..

1 month ago 12
సత్యసాయి జిల్లాలో వందేభారత్ రైలుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. హిందూపురం రైల్వేస్టేషన్ వద్ద రెండు ఆవులను వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. దీంతో పెద్దఎత్తున శబ్దం వచ్చింది. వెంటనే అప్రమత్తమైన లోకోపైలెట్ రైలును ఆపివేశారు. హిందూపురం నుంచి రైల్వే అధికారులు వచ్చి రైలును పరిశీలించారు. అంతా ఓకే అనుకున్న అనంతరం.. సుమారు అరగంట తర్వాత రైలు అక్కడి నుంచి బయల్దేరి వెళ్లింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఎవరూ గాయపడకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Read Entire Article