తిరుపతి జిల్లాలోని నాగలాపురం వేద నారాయణస్వామి ఆలయంలోకి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గన్ మెన్ తుపాకీతో ప్రవేశించారనే వార్తలపై టీటీడీ స్పందించింది. నిబంధనలకు విరుద్ధంగా గన్ మెన్ తుపాకీతో ఆలయంలోకి ప్రవేశిస్తున్నప్పటికీ.. టీటీడీ భద్రతా సిబ్బంది పట్టించుకోలేదని.. ఈ విషయంలో టీటీడీ భద్రతా సిబ్బంది వైఫల్యమంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై స్పందించిన టీటీడీ.. ఇవన్నీ అవాస్తవాలని తెలిపింది. అసలు ఏం జరిగిందనే దానిపై ప్రకటన విడుదల చేసింది.