షాబాద్ ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ హత్యలకు ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీడియోలో తాను అప్పులపాలయ్యానని, తనను నమ్మకద్రోహం చేశారని అతడు పేర్కొన్నట్లు సీపీ తరుణ్ జోషి తెలిపారు. ఈ వీడియోతో పాటు ఇతర డిజిటల్ ఆధారాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపిన పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేశారు.