ఆకివీడు రామాలయం: సుప్రీంకోర్టు తీర్పుతో వచ్చిన ఇబ్బందేమీ లేదు.. రఘురామకృష్ణరాజు

2 weeks ago 8
ఆకివీడులో రామాలయ పునర్నిర్మాణం అంశంపై స్టేటస్ కో విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించారు. ఈ అంశంపై విలేకర్ల సమావేశం నిర్వహించిన ఆయన.. పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో జడ శ్రవణ్ కుమార్ అన్ని అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. రామాలయాన్ని కృష్ణ శిలతో నిర్మిస్తున్నామని.. శిలల నిర్మాణం మైనింగ్ దగ్గరే జరుగుతుంది కనుక.. సుప్రీంకోర్టు ఆదేశాలతో వచ్చిన ఇబ్బందేమీ లేదన్నారు. సీనియర్ న్యాయవాదులను నియమించి.. ఈ అంశంపై సుప్రీంకోర్టు నుంచి అనుమతులు తెస్తామని వెల్లడించారు.
Read Entire Article