పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు పెదపేటలో రామాలయ నిర్మాణంపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రామాలయం నిర్మాణానికి అనుమతులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. రామాలయం నిర్మాణానికి అనుమతులు ఇవ్వడంపై కొంతమంది ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు.. గత 80 ఏళ్లుగా ఆకివీడు పెదపేటలో రామాలయం ఉన్నట్లు రికార్డుల్లో ఉందని పేర్కొంది. అన్ని రికార్డులు, ఆధారాలను పరిశీలించిన తర్వాతే రామాలయ నిర్మాణానికి అధికారులు అనుమతులు ఇచ్చినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే పిటిషన్ కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది.