రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా తెలంగాణపై ఆంధ్రా నేతలు పెత్తనం చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే ఏపీని అభివృద్ధి చేసుకుని, అక్కడ రాజధాని, ఆస్పత్రులు నిర్మాణం చేసుకోవాలని.. తెలంగాణ రాజకీయాలు తాము చూసుకుంటామని కవిత వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తే.. ఇక్కడ ఉన్న ఆంధ్రా నాయకుల విగ్రహాలను పగలగొట్టి.. ఆంధ్రాకు పార్సిల్ పంపిస్తామని తీవ్ర హెచ్చరికలు చేశారు.