దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మరో రైలు మార్గానికి భారీ అప్‌గ్రేడ్ చేయనున్నారు. రూ.285 కోట్ల ప్రాజెక్టుకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మహబూబ్‌నగర్-సికింద్రాబాద్-మేడ్చల్ రైల్వే సెక్షన్‌లో రైళ్ల రాకపోకలను మరింత మెరుగుపరిచేందుకు ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఈ మార్గంలో ఉన్న విద్యుత్ వ్యవస్థను మరింత అప్‌గ్రేడ్ చేయనున్నారు. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు మరింత పెరగనున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.