ఆ రెండు స్టేషన్లకు మహర్దశ.. ఆ వ్యవస్త అందబాటులోకి వస్తే ఇక నో వెయిటింగ్!

1 year ago 19
అనంతపురం జిల్లా గుంతకల్లు, గుత్తి రైల్వే జంక్షన్‌లకు మహర్దశ పట్టనుంది. త్వరలోనే అధునాతన సిగ్నలింగ్ క్యాబిన్ ఏర్పాటు కానుంది. ఇది కనుక పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రైళ్లు.. రైల్వేస్టేషన్లలో నిర్దేశిత సమయానికే బయల్దేరుతాయని అధికారులు చెప్తున్నారు. దీంతో ప్రయాణికులకు ఎదురుచూపులు తప్పుతాయంటున్నారు. అలాగే అడ్వాన్స్‌డ్ సిగ్నలింగ్ క్యాబిన్ వ్యవస్థ కంప్యూటర్ల ద్వారా నడుస్తుందని.. దీంతో రైలు ప్రమాదాలు నివారించవచ్చని చెప్తున్నారు. అయితే ఇది అందుబాటులోకి రావటానికి మరికొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.
Read Entire Article