విజయవాడ - బెంగళూరు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించాలంటూ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రాన్ని కోరారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సోమవారం భేటీ అయిన ఆయన.. మూడు విజ్ఞప్తులను రైల్వే మంత్రి ముందు ఉంచారు. విజయవాడ బెంగళూరు వందేభారత్, పిడుగురాళ్లలో వందేభారత్ రైలుకు స్టాపింగ్, పిడుగురాళ్ల - రామాయపట్నం మధ్య కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారని లావు శ్రీకృష్ణదేవరాయలు ట్వీట్ చేశారు.