ఆ మహనీయుడి విగ్రహం పెడతాం.. ట్యాంక్ బండ్‌పై అనుమతి ఇవ్వండి: ప్రభుత్వానికి కవిత రిక్వెస్ట్

1 month ago 10
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై అధికారికంగా ప్రతిష్టించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. స్వరాష్ట్రం సిద్ధించి 12 ఏళ్లు గడుస్తున్నా.. ప్రభుత్వం ఆయన అధికారిక విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. ట్యాంక్ బండ్ యుద్ధ ట్యాంకర్ పక్కన విగ్రహ ఏర్పాటుకు అనుమతిస్తే.. పూర్తి నిధులు, గ్రీనరీ నిర్వహణ బాధ్యతలను తెలంగాణ జాగృతి సంస్థే భరిస్తుందని చెప్పారు. ఆగస్టు 6 జయంతి నాటికి దీనిని పూర్తి చేయాలని లేఖలో కోరారు.
Read Entire Article