ఏలూరు జిల్లాలోని నూజివీడు రైల్వే స్టేషన్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఈ రైల్వే స్టేషన్ ఉండేది ఒక ప్రాంతంలో అయితే.. పిలిచేది వేరే పేరుతో కావడం విశేషం. నూజివీడు రైల్వే స్టేషన్ హనుమాన్ జంక్షన్ సమీపంలో ఉండే.. పిలిచేది మాత్రం 20 కిలోమీటర్ల దూరంలోని నూజివీడు పేరుతో. పూర్వపు రోజులలో నూజివీడు జమిందార్లు రైల్వే స్టేషన్‌కు ఆ పేరు పెట్టారు. అయితే ఇప్పటికైనా పేరు మార్చాలని స్థానికులు కోరుతున్నారు. కొంతమంది ప్రయాణికులు పొరబడుతున్న పరిస్థితి ఉందంటున్నారు.