ఆ ఇళ్లను హైడ్రా కూల్చదు.. వారికి భారీ ఊరటనిచ్చిన కమిషనర్ రంగనాథ్..

8 months ago 24
బోడుప్పల్‌లోని సుద్దకుంట చెరువు ప్రాంతంలో 30 ఏళ్లకు పైబడిన పాత ఇళ్లను కూల్చబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఎఫ్‌టీఎల్ పేరుతో ఇళ్లపై అక్రమంగా మార్కింగ్‌ చేసిన అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి, వాటిని తక్షణమే తొలగించాలని ఆదేశించారు. ప్రజల్లో భయం వద్దు, వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ చర్యతో ఊరట పొందిన స్థానికులు, కమిషనర్‌కు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన సేవలను ప్రశంసించారు. సుద్దకుంట అభివృద్ధికి కూడా కమిషనర్ సిఫార్సు చేశారు.
Read Entire Article