సూర్యాపేట జిల్లాలోని అర్వపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ అంతర్గత విభేదాలు.. రణరంగం సృష్టించాయి. తుంగతుర్తి కాంగ్రెస్ మండల అధ్యక్ష ఎన్నికల వివాదంలో ఎమ్మెల్యే మందుల సామేల్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గీయులు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఎన్నికల రద్దు కోరుతూ ఎంపీ వర్గీయులు గాంధీ భవన్‌కు వెళ్తుండగా ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకోవడంతో ఈ ఘర్షణ రేగింది. ఈ దాడుల్లో పలు వాహనాలు ధ్వంసం కాగా.. పోలీసులకు సైతం గాయాలు అయ్యాయి. చివరకు పోలీసులు లాఠీఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.