హైదరాబాద్ కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ పరిధిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌లో జరుగుతున్న పాడు పనులను లేడీ డీసీపీ రితిరాజ్ సాహసోపేతంగా బట్టబయలు చేశారు. వేర్వేరు నగరాల నుంచి యువతులను రప్పించి అర్ధనగ్న నృత్యాలు చేయిస్తూ.. కస్టమర్లను మత్తులో ముంచి వేలల్లో బిల్లులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంతో డీసీపీ స్వయంగా స్పై కెమెరాలతో మఫ్టీలో వెళ్లి ఆధారాలు సేకరించారు. అనంతరం అర్ధరాత్రి దాడి చేసి పబ్ మేనేజర్‌తో పాటు నలుగురు యువతులు, నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.