అమ్మ బాబోయ్.. ధర్మవరంలో ముసుగు దొంగలు.. బొలెరోకు తాళ్లు కట్టి ఏటీఎంనే ఎత్తుకెళ్లారు!

4 weeks ago 10
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో దొంగలు రెచ్చిపోయారు. బొలెరో కారుకు తాళ్లు కాట్టి బ్యాంక్ ఏటీఎంనే ఎత్తుకెళ్లారు. పార్థసారథి నగర్‌లో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. బొలెరో వాహనంలో వచ్చిన ముగ్గురు ముసుగు దొంగలు.. తొలుత ఏటీఎంలోకి చొరబడ్డారు. రాడ్లతో ఏటీఎం మెషీన్ పెకిలించే ప్రయత్నం చేశారు. అయితే ఎంతకీ రాకపోవడంతో బొలెరో వాహనానికి తాళ్లు బలంగా గట్టిగా లాగారు. ఆ తర్వాత ఏటీఎంను వాహనంలోకి ఎక్కించి ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీ సాయంతో గాలిస్తున్నారు. దొంగలు కారులో బత్తలపల్లి వైపుగా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
Read Entire Article