Two Telugu People Died In Usa: అమెరికాలో ఇద్దరు తెలుగువారు ప్రాణాలు కోల్పోయారు. విజయవాడకు చెందిన తేజ స్కైడైవింగ్ కోసం వెళ్లి కిందపడి చనిపోయారు.. ఉద్యోగంలో చేరే ముందురోజు ప్రమాదంలో చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. అలాగే పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన విద్యార్థిని మక్కెన ప్రసన్న రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆమె అమెరికాలో ఎంఎస్ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు.. స్నేహితులతో కలిసి ఓ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.