Amaravati Growth And Infrastructure Corporation Limited MD Resign: అమరావతి నిర్మాణంలో కీలకంగా వ్యవహరిస్తున్న అధికారి రాజీనామా ఎపిసోడ్ చర్చనీయాంశంగా మారింది. అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా శ్రీనివాస్ గత నెల 1న రాజీనామా చేయగా.. తాజాగా ప్రభుత్వం ఆమోదించింది. ఆయన స్థానంలో ఏజీఐసీఎల్ బాధ్యతల్ని సీఆర్‌డీఏ అడిషనల్ కమిషనర్ అభిషేక్ కుమార్‌కు అప్పగించారు. శ్రీనివాస్ ఉన్నట్టుండి పదవికి రాజీనామా చేయడం ఇప్పుడు హాట్‌టాపిక్ అయ్యింది.