విశాఖలో బోటు తిరగబడి ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు అన్న విషాద ఘటన మరువక ముందే అనకాపల్లి జిల్లాలో మరొకటి చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మత్స్యకారులతో వెళ్లిన ఓ బోటు సముద్రంలో తిరగబడింది. అందులో నలుగురూ గల్లంతవ్వగా.. ముగ్గురు మాత్రం ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు. గల్లంతైన నాలుగో వ్యక్తి మృతదేహం మాత్రం బంగారమ్మపాలెం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. సముద్రం ప్రమాదకరంగా ఉంది కాబట్టి ఎవ్వరూ వేటకు వెళ్లొద్దంటూ ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు.