అనకాపల్లి జిల్లాలో ఓ వివాహ వేడుకలో జరిగిన భారీ దోపిడీ కేసును నాతవరం పోలీసులు గంటల్లోనే ఛేదించారు. అత్యంత చాకచక్యంగా వ్యవహరించి కేవలం మూడు గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు పూర్తి సొత్తును రికవరీ చేశారు. బాధితులు సకాలంలో 112 నంబర్‌కు ఫోన్ చేయడం వల్లే ఈ కేసు ఇంత వేగంగా కొలిక్కి వచ్చిందని పోలీసులు తెలిపారు.ఈ క్రమంలోనే నాతవరం పోలీసులను అనకాపల్లి జిల్లా ఎస్పీ అభినందించారు. నేరాలు జరిగినప్పుడు ప్రజలు భయపడిపోకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.