గుప్తనిధులపై అత్తమామల అత్యాశ.. అల్లుడు, కూతురి ప్రాణాల్ని బలి తీసుకుంది. ఇంట్లో నిధి ఉందన్న సాధువు మాటలు నమ్మి.. అల్లుడితో రూ.10 లక్షల అప్పు చేయించి అత్తమామలు, తోడల్లుడు మోసం చేయడంతో అప్పుల ఒత్తిడి తట్టుకోలేక దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుడి ఫోన్‌లోని సూసైడ్ మెసేజ్ ఆధారంగా పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వీరి మరణంతో 5 నెలల పసికందు అనాథగా మిగిలింది. ఈ ఘటన హైదరాబాద్ శివారు మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలోని జన్వాడలో చోటు చేసుకుంది.