కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం అంకుశాపూర్‌లో జరిగిన మొగిలి అనే వ్యక్తి హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. తనతో సన్నిహితంగా ఉండే వివాహితను, తనను సమాజంలో కించపరుస్తూ మాట్లాడుతున్నాడనే కక్షతో గంగరాపు మహేష్ అనే వ్యక్తి ఈ హత్యకు పాల్పడ్డాడు. ఇందుకోసం యూట్యూబ్‌లో క్రైమ్ వీడియోలు, ఆయుధాల తయారీని శోధించిన మహేష్.. ఈనెల 28న అర్ధరాత్రి మొగిలిని ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రాడ్డు, బైక్, మొబైల్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.