అందెశ్రీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం : సీఎం రేవంత్ రెడ్డి

8 months ago 19
అందెశ్రీ మరణం తెలంగాణ సమాజానికి, వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర గీతంగా ‘జయ జయహే తెలంగాణ’ను నిర్ణయించిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. ఘట్‌కేసర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. అందెశ్రీ రచనలు ప్రజల జీవన స్ఫూర్తి అని, ఆయన ప్రతి పాటలో తెలంగాణ ఉద్యమ ఆవేశం ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ‘జయ జయహే తెలంగాణ’ను పాఠ్య పుస్తకాల్లో చేర్చనున్నట్లు తెలిపారు. అందెశ్రీ కుటుంబ సభ్యుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, ఆయన రచనల ‘నిప్పులవాగు’ పుస్తకాన్ని ప్రతి గ్రంథాలయంలో అందుబాటులో ఉంచుతామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
Read Entire Article