అంత గొప్పోడివి అయితే.. ఏపీలో ఆదాయం ఎందుకు పెరగడం లేదు: జగదీశ్‌రెడ్డి

1 year ago 50
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ అభివృద్ధిపై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు మాటలు హాస్యాస్పదమని, మోసపూరితమని ఆయన అన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం గణనీయంగా పెరిగినప్పటికీ.. చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆదాయం అనుకున్నంతగా ఎందుకు పెరగలేదని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు పదవీకాలం నాటి తలసరి ఆదాయం, తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాలనలో సాధించిన అభివృద్ధిని గణాంకాలతో పోల్చి చూపారు.
Read Entire Article