YSRCP: వైసీపీకి వరుస షాకులు.. అది కూడా చేజారిపోయింది..!

1 year ago 21
ఏపీలో వైసీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే విశాఖపట్నం మేయర్ పదవిని కోల్పోయిన వైసీపీ.. తాజాగా డిప్యూటీ మేయర్ పదవిని కూడా కోల్పోయింది. డిప్యూటీ మేయర్ జియాన్ని శ్రీధర్ మీద కూటమి సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో శ్రీధర్ డిప్యూటీ మేయర్ పదవిని కోల్పోయారు. మరోవైపు ఇటీవలే హరి వెంకట కుమారి విశాఖ మేయర్ పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి ఏప్రిల్ 28వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు.
Read Entire Article