YSRCP: వైసీపీకి మరో షాక్.. ఈసారి విజయవాడలో..

1 year ago 31
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. వైసీపీకి చెందిన కీలక నేతలు కొంతమంది ఇప్పటికే జనసేనలో చేరిపోయారు. ఇప్పుడు వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు కూడా జనసేన వైపు చూస్తున్నారు. సోమవారం విజయవాడకు చెందిన కార్పొరేటర్లు జనసేన కండువా కప్పుకున్నారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వీరంతా జనసేన గూటికి చేరారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరందరినీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని సూచించారు. ఈ క్రమంలోనే గతాన్ని ఓ సారి గుర్తుచేసుకున్నారు.
Read Entire Article