YSRCP: వైఎస్ జగన్ పల్నాడు పర్యటనలో అపశ్రుతి.. కీలక వివరాలు వెల్లడించిన గుంటూరు ఎస్పీ

11 months ago 28
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. ఏటుకూరు బైపాస్ వద్ద జగన్ కాన్వాయి ముందు ఉన్న ఓ ప్రైవేట్ వాహనం ఢీకొట్టి సింగయ్య అనే వృద్ధుడు చనిపోయాడు. అటు సత్తెనపల్లిలో మరో వైసీపీ కార్యకర్త చనిపోయినట్లు తెలిసింది. సత్తెనపల్లి క్లాక్ టవర్ వద్ద ఊపిరాడక ఓ వైసీపీ కార్యకర్త సొమ్మసిల్లి పడిపోగా.. చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు సమాచారం. మరోవైపు ఈ ఘటనపై టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది.
Read Entire Article