YS Sharmila: బాబూగారూ ఆ పద్ధతి మానేయండి.. గరిటె మోగించిన షర్మిల

2 years ago 42
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల.. సీఎం చంద్రబాబు నాయుడుపైనా, టీడీపీ కూటమి ప్రభుత్వంపైనా విమర్శలు సంధించారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా జాప్యం చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా థాలీ బజావో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడలో జరిగిన నిరసన కార్యక్రమంలో షర్మిల పాల్గొన్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయని ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఎలా అవుతుందని.. ముంచే ప్రభుత్వం అవుతుందని సెటైర్లు వేశారు. హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Read Entire Article