Ys Sharmila: అమరావతి మహిళలకు క్షమాపణలు చెప్పాల్సిందే

1 year ago 37
రాజధాని అమరావతి ప్రాంత మహిళలపై చేసిన వ్యాఖ్యల విషయంలో క్షమాపణలు చెప్పడం వైఎస్ భారతీరెడ్డి బాధ్యతన్నారు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. మాజీ ముఖ్యమంత్రి, తన అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పడంలోనూ తప్పులేదన్నారు. రాజధాని అమరావతి, ఆ ప్రాంత మహిళలకు వ్యతిరేకంగా మాట్లాడిన ఏ మాట కూడా క్షమించరానిదన్నారు. అమరావతి, మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని.. ఏపీ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, ఈ అంశంపై ఇప్పటివరకూ వైఎస్సార్‌సీపీ కానీ, సదరు మీడియా సంస్థ కానీ క్షమాపణ చెప్పలేదన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని.. సమస్యలపై తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.
Read Entire Article