ఏపీవాసులకు వాతావరణ శాఖ అధికారులు చల్లటి కబురు చెప్పారు. అల్పపీడనం ప్రభావంతో శనివారం రోజున రాష్ట్రంలోని పలు జిల్లాలలో వర్షం కురవనుంది. అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీని ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉందని.. మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.