Warangal Super Specialty Hospital: పేదలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం.. వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌పై సీఎం స్పెషల్ ఫోకస్‌

1 month ago 14
Warangal Hospital: వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనుల్లో జాప్యంపై సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే 30 రోజులు 24 గంటలూ పనులు కొనసాగించి నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి పనికి ప్రత్యేక అధికారిని నియమించి, కలెక్టర్‌ ప్రతిరోజూ పర్యవేక్షించాలని సూచించారు. ఆసుపత్రిలో ఓపీ సేవలు ప్రారంభించాలని, స్టాఫ్‌ క్వార్టర్స్‌, నిర్వహణ ఏర్పాట్లను వేగవంతం చేయాలని చెప్పారు. 24 అంతస్తులు, మూడు ప్రధాన బ్లాకులు, 2,018 పడకలు, 35 ఆపరేషన్‌ థియేటర్లతో ఈ ఆసుపత్రి ఉత్తర తెలంగాణకు కీలక వైద్య కేంద్రంగా మారనుంది. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందనుంది.
Read Entire Article