హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో 4 లేన్ల స్టీల్ ఆర్‌ఓబీ నిర్మాణానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. గుల్మోహర్ జంక్షన్ నుంచి బీహెచ్‌ఈఎల్ వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ ప్రాజెక్టుకు జంక్షన్ల అభివృద్ధితో కలిపి రూ.308 కోట్లు ఖర్చు కానున్నాయి. వేగంగా పనులు పూర్తి చేయడంతో పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం తగ్గించేందుకు స్టీల్ నిర్మాణాన్ని ఎంచుకున్నారు. గుల్మోహర్ పార్క్ జంక్షన్ దాటి బ్రిడ్జిని పొడిగించడం వల్ల గచ్చిబౌలి నుంచి బీహెచ్‌ఈఎల్ వెళ్లే వాహనాలకు సౌకర్యం కలుగుతుంది. వర్షాలకు నీట మునిగే లింగంపల్లి అండర్‌పాస్‌పై ఆధారపడాల్సిన అవసరం తగ్గడంతో పాటు నల్లగండ్ల ఆర్‌ఓబీపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గనుంది.