Vizag Court: విశాఖ కోర్టు సంచలన తీర్పు.. అప్పలరాజుకు ఉరిశిక్ష.. అసలేం జరిగిందంటే?

11 months ago 34
హత్య కేసులో విశాఖపట్నం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆరుగురిని హత్య చేసిన అప్పలరాజు అనే వ్యక్తికి విశాఖ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. 2021 ఏప్రిల్‌ 15న ఈ హత్యలు జరిగాయి. సుమారుగా నాలుగేళ్ల తర్వాత అప్పలరాజుకు కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో ఒకే కుటుంబంలోని ఆరుగురిని అప్పలరాజు దారుణంగా హత్య చేశాడు. కత్తితో ఓ చిన్నారి సహా ఆరుగురిని దారుణంగా నరికి చంపాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ కేసులో విచారణ జరిపిన విశాఖ న్యాయస్థానం.. నిందితుడికి మరణశిక్ష విధిస్తూ తీర్పును ప్రకటించింది.
Read Entire Article