ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగినట్లుగా చెప్తున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆదోని మండలం వీరుపాపురంలో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. పవిత్రమైన శివాలయంలో దేవుడి ముందు ఉంచిన దీపంతో సిగరెట్ వెలిగించుకున్నాడో ఆకతాయి. కొంతమంది ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ నేత సాదినేని యామినితో పాటుగా పలువురు నెటిజన్లు ఏపీ పోలీసులను కోరుతున్నారు.