యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై గన్నవరం పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం - (ఉపా చట్టం) కింద కేసు నమోదు చేశారు. జనసేన నాయకుడు గరికపాటి శివశంకర్ ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఉపా చట్టం అంటే ఏమిటి.. కేంద్ర ప్రభుత్వం ఎందుకోసం ఈ చట్టం తీసుకువచ్చింది.. సాధారణ చట్టాలకు దీనికి ఉన్న వ్యత్యాసం ఏమిటి.. ఈ చట్టం కింద కేసు నమోదైతే బెయిల్ వస్తుందా రాదా అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.